yadadri: యాదాద్రి పనుల వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తుల అరెస్ట్

  • అనుమతులు లేకుండానే వీడియో షూట్
  • యూట్యూబ్ లో అప్ లోడ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పనులకు సంబంధించిన వీడియోను ఇద్దరు వ్యక్తులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వైటీడీఏ, ఆలయ ఈవో నుంచి అనుమతులు పొందకుండానే వీడియోను తీసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో, ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ అంబర్ పేట్ కు చెందిన రాకేష్ బోనం, నవీన్ ముదిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీడియో ఐపీ ఆధారంగా వీరిని పోలీసులు గుర్తించారు. నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి సెల్ ఫోన్ ను సీజ్ చేశామని చెప్పారు.

More Telugu News