Beresheet: చంద్రుడిపై కుప్పకూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక

  • చివరిదశలో సాంకేతికలోపాలు
  • దెబ్బతిన్న కమ్యూనికేషన్ వ్యవస్థ
  • విఫలమైన మూన్ మిషన్

ఇజ్రాయెల్ అవడానికి చిన్న దేశం అయినా టెక్నాలజీ పరంగా అగ్రరాజ్యాలకు దీటుగా ఎదిగింది. కొన్ని విషయాల్లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలను మించి సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఇజ్రాయెల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి చంద్రుడి పైకి ప్రయోగించిన బేరెషీట్ అనే స్పేస్ క్రాఫ్ట్ అనుకోని పరిస్థితుల్లో కుప్పకూలిపోయింది. చంద్రమండలంపై ఇతర దేశాలు చేయలేని పరిశోధనలు చేయాలని భావించిన ఇజ్రాయెల్ బేరెషీట్ అంతరిక్షనౌకను ప్రయోగించింది.

అయితే,  బేరెషీట్ లో సాంకేతిక వైఫల్యాలు తలెత్తాయి. వాటిని గ్రౌండ్ కంట్రోల్ ఫెసిలిటీ నుంచి సరిదిద్దాలని శాస్త్రవేత్తలు భావించినా బేరెషీట్ లో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా విఫలమైంది. దాంతో చేసేదిలేక బేరెషీట్ ను విచారకర పరిస్థితుల్లో వదిలేశారు. బుధవారం చంద్రుని కక్ష్యలో ప్రవేశించి ఆపై అక్కడి ఉపరితలాన్ని బలంగా ఢీకొని శకలాలుగా మారిపోయింది.

More Telugu News