modi biopic: మళ్లీ సుప్రీం తలుపుతట్టిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా నిర్మాత

  • సినిమా రిలీజ్‌ను నిలిపివేస్తూ ఆదేశించిన ఈసీ
  • దీనివల్ల ఆర్థికంగా తనకు నష్టమని నిర్మాత పిటిషన్‌
  • సోమవారం దీనిపై విచారణ జరుపుతామన్న అపెక్స్‌ కోర్టు

భారత ప్రధాని నరేంద్రమోదీ జీవిత ఘట్టాల ఆధారంగా నిర్మించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా రిలీజ్‌కు అనుమతించాలని కోరుతూ చిత్ర నిర్మాత మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. చిత్రం విడుదలను నిలిపివేస్తే ఆర్థికంగా తాను నష్టపోతానని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అపెక్స్‌ కోర్టు సోమవారం దీనిపై విచారణ జరపనున్నట్లు తెలిపింది.

సందీప్‌ సింగ్‌ నిర్మాతగా ఓమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాని పాత్రను వివేక్‌ ఓబెరాయ్‌ పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మోదీ నాయత్వం వహిస్తున్నందున రాజకీయంగా వారికి ప్లస్‌ అవుతుందని, అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని విపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. దీంతో ఈనెల 11వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉండగా ముందు రోజు ఈసీ చిత్రం విడుదలకు బ్రేక్‌వేసింది. ఈసీ నిర్ణయం తనకు నష్టదాయకమని పిటిషనర్ పేర్కొన్నారు.

More Telugu News