Aishwarya Rai: మరోసారి హాలీవుడ్ కి ఐశ్వర్య రాయ్

  • ఐశ్వర్య రాయ్ కి విపరీతమైన క్రేజ్ 
  • బాలీవుడ్లో తిరుగులేని కథానాయిక
  • పట్టాలెక్కనున్న హాలీవుడ్ మూవీ

తన అందచందాలతో, అభినయ కౌశలంతో చాలా తక్కువ సమయంలోనే తారాపథంలోకి దూసుకుపోయిన కథానాయికగా ఐశ్వర్య రాయ్ ని చెప్పుకోవచ్చు. బాలీవుడ్లో ఒక వెలుగు వెలుగుతోన్న సమయంలోనే ఆమె హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించింది. అయితే ఆశించిన స్థాయిలో అక్కడ గుర్తింపు రాకపోకవడంతో, బాలీవుడ్ పైనే పూర్తి దృష్టి పెడుతూ తిరుగులేని కథానాయికగా సుదీర్ఘకాలం పాటు తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది.

అలాంటి ఐశ్వర్య రాయ్ తన కూతురు 'ఆరాధ్య'ను దగ్గరుండి చూసుకోవడం కోసమే పూర్తి సమయాన్ని కేటాయిస్తూ వచ్చింది. రీ ఎంట్రీ తరువాత తనకి బాగా నచ్చే పాత్రలు చేయాలనే ఆలోచనలో వుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆమెకి ఒక హాలీవుడ్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చిందట. ఆ సినిమాలో చేయడానికి ఐశ్వర్య రాయ్ అంగీకరించిందని చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో హాలీవుడ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. 

More Telugu News