chaitu: నైజామ్ లో దుమ్మురేపేస్తోన్న 'మజిలీ'

  • శివ నిర్వాణ నుంచి వచ్చిన 'మజిలీ'
  • నైజామ్ లో 10 కోట్ల షేర్ దిశగా పరుగులు
  •  చైతూ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా నటించిన 'మజిలీ' మూవీ, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా దివ్యాన్ష కౌశిక్ కొత్త కథానాయికగా పరిచయమైంది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి భారీ వసూళ్లను రాబడుతోంది. నిన్న ఎన్నికల కారణంగా అన్ని కార్యాలయాలకు సెలవు ఉండటంతో, ఈ సినిమాకి అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు పెరగడం విశేషం.నైజామ్ ఏరియాలో ఈ సినిమా ఇంతవరకూ 7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా 10 కోట్ల షేర్ మార్క్ ను అందుకుంటుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 21.14 కోట్లకు అమ్మడం జరిగింది. తొలి 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.61 కోట్ల షేర్ ను వసూలు చేసి, లాభాల బాటలోకి అడుగుపెట్టింది. చైతూ కెరియర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

More Telugu News