Sonia Gandhi: రాహుల్ గాంధీకి రూ.5 లక్షలు బాకీపడిన సోనియా గాంధీ!

  • ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు వెల్లడి
  • చేతిలో ఉన్నది రూ.60 వేలేనట!
  • ఇటలీలో రూ.7.52 కోట్ల పెట్టుబడులు

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ భారీ జనసందోహం వెంటరాగా ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేళ సోనియా వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఉన్నారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. తన చేతిలో ప్రస్తుతం రూ.60 వేలు మాత్రమే ఉన్నాయని, కుమారుడు రాహుల్ గాంధీకి తానే రూ.5 లక్షలు బాకీపడ్డానని పేర్కొన్నారు.

  • ఫిక్స్ డ్ డిపాజిట్లు- రూ.16.59 లక్షలు
  • షేర్ల రూపంలో పెట్టుబడులు- రూ.2.44 కోట్లు
  • ట్యాక్స్ బెనిఫిట్స్- రూ.28,533
  • పోస్టల్ సేవింగ్స్- రూ.72.25 లక్షలు
  • దరామండీ గ్రామంలో భూమి విలువ- రూ.7.29 కోట్లు
  • మాతృదేశం ఇటలీలో పెట్టుబడులు- రూ.7.52 కోట్లు
  • నగల రూపంలో ఉన్న ఆస్తి విలువ- రూ.59.97 లక్షలు

More Telugu News