trisha: త్రిష ప్రధాన పాత్రధారిగా విభిన్న కథా చిత్రం

  • మళ్లీ బిజీ అవుతోన్న త్రిష 
  • వరుసగా వస్తోన్న అవకాశాలు
  •  శరవణన్ సినిమాపై అంచనాలు  

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. కొత్త కథానాయికల పోటీ ఎక్కువ కావడంతో, ఈ రెండు భాషల్లోనూ ఆమె జోరు తగ్గుతూ వచ్చింది. అయితే ఇటీవల తమిళంలో ఆమె చేసిన '96' .. 'పేట' సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడంతో, ఒక్కసారిగా అవకాశాలు పుంజుకున్నాయి. దాదాపు అరడజను సినిమాలకి ఆమె సైన్ చేసేసిందంటే, ఏ స్థాయిలో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ ప్రాజెక్టులలోనే ఆమె ప్రధాన పాత్రధారిగా చేసే సినిమా కూడా వుంది. మురుగదాస్ శిష్యుడు శరవణన్ .. ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన 'జర్నీ' ఏ స్థాయి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి మురుగదాస్ స్క్రిప్ట్ ను అందిస్తుండటం విశేషం. మురుగదాస్ సినిమాలకి ప్రధానమైన బలం ఆయన తయారుచేసుకునే స్క్రిప్ట్ అని అంటూ వుంటారు. అందువలన త్రిష చేసే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.

More Telugu News