akhilapriya: చాలా దారుణంగా ఉంది.. ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడం లేదు: అఖిలప్రియ ఫైర్

  • గొడవలు జరుగుతున్నా, ఈవీఎంలు పని చేయకపోయినా పట్టించుకోవడం లేదు
  • పీడీ యాక్ట్ కింద కేసులున్నవారు బూత్ లలో ఉన్నారు
  • మంచికే జనాలు ఓటు వేస్తారన్న నమ్మకం ఉంది

పోలింగ్ జరుగుతున్న తీరుపై మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. పలుచోట్ల గొడవలు జరుగుతున్నా, ఈవీఎంలు పని చేయకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పీడీ యాక్ట్ కింద కేసులు ఉన్నవారు కూడా పోలింగ్ బూత్ లలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి ఉండాలని అఖిలప్రియ అన్నారు. మంచికే జనాలు ఓటు వేస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. పోలింగ్ బూత్ ల వద్ద జనాలను నియంత్రించలేకపోతున్నారని... ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. కొన్ని చోట్ల మూడు గంటల సేపు పోలింగ్ ఆలస్యమయిందని... ఆమేరకు సమయాన్ని పొడిగిస్తారా? అని ప్రశ్నించారు.

More Telugu News