upasana: దేశానికి ఎంతో పన్ను చెల్లిస్తోంది... అయినా లెక్కలోకి తీసుకోరా?: ఉపాసన

  • ఉపాసన తల్లి శోభన కామినేని ఓటు గల్లంతు
  • 10 రోజుల కింద చెక్ చేసినప్పుడు ఉన్న ఓటు
  • నా తల్లికి ఈ దేశ పౌరురాలిగా ఉండే అర్హత లేదా? అని ప్రశ్నించిన ఉపాసన

తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి వచ్చిన అపోలో హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్ ప్రతాప్‌పెడ్డి కుమార్తె శోభనా కామినేని ఓటు గల్లంతైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను భారతీయురాలిని కాదా? అని ప్రశ్నించారు. ఓటును తొలగించడం తీవ్రమైన నేరమని ఆమె చెప్పారు. కాగా, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా శోభన సమీప బంధువేనన్న సంగతి తెలిసిందే.  

ఈ ఘటనపై శోభన కుమార్తె, హీరో రాంచరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'మా అమ్మ శోభన ఈరోజు ఓటు వేయలేకపోయారు. 10 రోజుల క్రితం ఓటరు లిస్టులో ఆమె తన పేరును చెక్ చేసుకున్నారు. అప్పుడు ఓటు ఉంది. ఇప్పుడు దాన్ని తొలగించారు. దేశానికి ఆమె ఎంతో పన్ను చెల్లిస్తోంది. ఆమెను లెక్కలోకి కూడా తీసుకోరా? భారతీయ పౌరురాలిగా ఉండే అర్హత ఆమెకు లేదా?' అని ప్రశ్నించారు.

More Telugu News