Virat Kohli: అదే అవార్డును మరోసారి ఎగరేసుకెళ్లిన విరాట్ కోహ్లీ

  • విరాట్ కోహ్లీకి విజ్డెన్ అవార్డు
  • వరుసగా మూడోసారి పురస్కారం
  • కోహ్లీ బ్యాటింగ్ పై విజ్డెన్ ప్రశంసలు

ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ మరోసారి మేటి క్రికెటర్ గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం కోహ్లీకిది వరుసగా మూడోసారి. 2018 సీజన్ కు గాను అత్యుత్తమ క్రికెటర్లుగా కోహ్లీతో పాటు ఇంగ్లాండ్ కు చెందిన జోస్ బట్లర్, శామ్ కరన్, రోరీ బర్న్స్, టామీ బ్యూమోంట్ (ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్) కూడా ఉన్నారు.

కోహ్లీనీ ఈ అవార్డుకు ఏ విధంగా ఎంపిక చేశారో విజ్డెన్ తెలిపింది. 2014లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ చేసిన పరుగులు 134 మాత్రమే కాగా, గతేడాది ఆ వైఫల్యాలన్నీ మరుగున పడేలా 593 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. 2014లో దారుణ వైఫల్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కోహ్లీ నిర్భీతిగా ఆడిన తీరు తమను ఎంతగానో ఆకట్టుకుందని విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ వెల్లడించారు.

More Telugu News