paruchuri: నాపై కృష్ణగారికి కోపం వచ్చింది .. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • కృష్ణగారు మా పాలిట దైవం 
  • విజయ నిర్మలగారు చెప్పింది నాకు వినిపించలేదు
  • కృష్ణగారికి విపరీతమైన కోపం వచ్చేసింది  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా .. 'వజ్రాయుధం' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "ఎన్టీ రామారావుగారు .. కృష్ణగారు నాకు రెండు కళ్లవంటి వారు. ఎన్టీ రామారావుగారు మాకు 'పరుచూరి బ్రదర్స్' అని పేరు పెడితే, ఆ పరుచూరి బ్రదర్స్ నిలదొక్కుకోవడంలో కృష్ణ గారు ప్రధానమైన పాత్రను పోషించారు. ''అవి 'వజ్రాయుధం' షూటింగు జరుగుతోన్న రోజులు. 'సోమశిల' ప్రాజెక్టు దగ్గర షూటింగు జరుగుతోంది.

అప్పట్లో నాకు మైగ్రేన్ ఉండేది .. ఆ బాధలో నేను ఉండగా విజయ నిర్మల గారు వచ్చి ఏదో చెప్పారు. అక్కడే కృష్ణగారు .. రాఘవేంద్రరావుగారు వున్నారు. 'ఏంటమ్మా ..' అనడంతో విజయనిర్మల గారు మళ్లీ నాకు ఏదో చెప్పారు. భరించలేని తలనొప్పి కారణంగా నాకు వినిపించక .. 'ఏంటండీ?' అన్నాను.

అంతే .. అది నా నిర్లక్ష్యమనుకుని, నేను తన మాటలని పట్టించుకోలేదని విజయనిర్మల గారు అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయారు. తనకు మనవడు పుట్టిన విషయాన్ని ఆమె నాకు చెప్పారట. అది నాకు వినపడలేదు. ఈ విషయాన్ని నాకు రాఘవేంద్రరావుగారు తర్వాత చెప్పారు. అంతలో కృష్ణగారు వచ్చి .. నన్ను అక్కడి నుంచి చెన్నైకి పంపించేయమని కోపంగా చెప్పారు. మేము దైవంలా భావించే మనిషి కోపానికి గురైన రోజు అది. నాతో పాటు మా అన్నయ్య కూడా బయల్దేరడంతో .. ఇద్దరం చెన్నైకి వెళ్లిపోయాము" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News