Priya Prakash Varior: మరింత గ్లామర్ గా కనిపిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్!

  • దేశవ్యాప్తంగా ప్రియకు అభిమానులు
  • తాజాగా కమర్షియల్ యాడ్ కోసం షూట్
  • స్నేహా ఉల్లాల్, కృతీ వర్మలతో ప్రియ

ఒక్కసారి కన్నుగీటి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్, తన 'లవర్స్ డే'తో మెప్పించలేక పోయినా, అందచందాలతో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా, ఓ కమర్షియల్ యాడ్ కోసం ప్రియా ప్రకాశ్ పనిచేసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, వాటిల్లో ప్రియ మరింత గ్లామరస్ గా కనిపిస్తోందని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. ఈ యాడ్ లో ప్రియతో పాటు దక్షిణాది హీరోయిన్ స్నేహా ఉల్లాల్, బిగ్ బాస్ సీజన్ 12 పోటీదారు కృతీ వర్మ కూడా కనిపిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని మీరూ చూడండి.

More Telugu News