rajasekhar: ఆసక్తిని రేపుతోన్న 'కల్కి' టీజర్

  • ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
  • పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా 'కల్కి' సినిమా రూపొందుతోంది. రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ .. నందిత శ్వేత అలరించనున్నారు. రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.

సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఈ టీజర్ ను కట్ చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. గతంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాల్లో చాలా వరకూ భారీ విజయాలను సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

More Telugu News