Vijayawada: లారీలో సిమెంట్ బస్తాల మధ్య రూ. 2 కోట్లు... విజయవాడలో పట్టివేత!

  • బస్తాల మధ్య భారీగా నగదు
  • ఏలూరుకు తరలిస్తున్నట్టు అనుమానం
  • విచారిస్తున్న పోలీసులు

ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్న వేళ, ఆంధ్రప్రదేశ్ లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాగైనా ఓట్లను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో భారీగా డబ్బులను పంచేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్న వేళ, ఈసీ, పోలీసుల సంయుక్త బృందాలు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఉదయం విజయవాడ, ఎనికేపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళుతున్న లారీలో రూ. 1.95 కోట్లు పట్టుబడ్డాయి. సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీని ఆపిన పోలీసులకు, సిమెంట్ లోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందన్న పత్రాలు లభ్యం కాకపోవడంతో తనిఖీ చేయగా, భారీ ఎత్తున డబ్బు కనిపించింది. రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సిమెంట్ బస్తాల మధ్య పెట్టి తీసుకుని వెళుతుండగా అధికారులు గుర్తించారు. ఈ డబ్బును కంచికచెర్ల నుంచి ఏలూరుకు తీసుకెళుతున్నారని గుర్తించిన తనిఖీ సిబ్బంది, ఇది ఎవరిదన్న కోణంలో విచారణ ప్రారంభించారు. లారీని పటమట పోలీసు స్టేషన్ కు తరలించారు.

More Telugu News