Allu Arjun: బన్నీ బర్త్ డే సందడి.. వర్షంలో సైతం తరలివచ్చిన అభిమానులు!

  • 36వ పుట్టినరోజును జరుపుకున్న బన్నీ
  • వర్షంలోనే ఫ్యాన్స్‌ని పలకరించేందుకు డాబాపైకి బన్నీ
  • మొక్కల్ని కానుకగా ఇచ్చిన సినీ ప్రముఖులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిన్న తన 36వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు ఓ పక్క వడగండ్ల వాన కురుస్తున్నా బన్నీ ఇంటి ఆవరణలో తడుస్తూ నిలబడిపోయారు. వారిని పలకరించేందుకు బన్నీ కూడా వర్షంలోనే డాబాపైకి వచ్చి అభివాదం చేశాడు.

బన్నీని చూసిన అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా బన్నీకి పలువురు ప్రముఖులు కూడా మొక్కల్ని కానుకగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బన్నీని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, హరీష్ శంకర్, మారుతి, శ్రీరామ్ వేణు తదితరులున్నారు.

More Telugu News