రౌడీయిజంతో జగన్ చెలరేగాలనుకుంటే చూస్తూ ఊరుకోబోం: ఆదినారాయణరెడ్డి

09-04-2019 Tue 16:44
  • సంక్షేమ పథకాలతో జిల్లా ప్రజలు లబ్ధి పొందుతున్నారు
  • జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
  • జిల్లాకు సాగు, నీటిని అందించాం

ఫ్యాక్షన్ లేని జిల్లాగా కడపను అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప జిల్లాకు సాగు, తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో జిల్లా ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. రౌడీయిజంతో జగన్ చెలరేగితే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.