Andhra Pradesh: భద్రాచలంపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు.. ఒక కన్ను పోయాక గుర్తుకు వచ్చిందా?: చంద్రబాబుపై ఐవైఆర్ సెటైర్లు

  • ఎన్నికల ముందే ఎందుకు గుర్తుకు వచ్చారు
  • ప్రత్యేక జిల్లా చేస్తామని కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు కదా
  • చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేత

భద్రాచలం ప్రాంతాన్ని తమకు వెనక్కు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేయడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యంగా స్పందించారు. సరిగ్గా ఎన్నికల ముందే చంద్రబాబుకు భద్రాద్రి రాములోరు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఏపీ విభజన సమయంలో ఈ విషయమై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

అప్పుడే భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని కేంద్రాన్ని ఒప్పించి ఏపీకి తెచ్చుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అప్పట్లో రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఈ విషయమై చంద్రబాబు మాట్లాడలేదనీ, కానీ ఈరోజు వాటిలో ఒక కన్ను పోయింది కాబట్టి అడుగుతున్నారని సెటైర్లు వేశారు.

ఈరోజు ఐవైఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నిజమే.. భద్రాచలం మనదే. రాములోరు మనవాడే. ఈ విషయం ఎన్నికల ముందు గుర్తొచ్చిందా? విభజన సమయంలో ఏమైంది? భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవచ్చు కదా! ఆ రోజు రెండు కళ్ల సిద్ధాంతం అడ్డు వచ్చింది. ఈరోజు ఒక కన్ను పోయింది కాబట్టి గట్టిగా అడుగుతున్నాం’ అని ట్వీట్ చేశారు.

More Telugu News