rajasekhar: 'కల్కి' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • మరోసారి పోలీస్ ఆఫీసర్ గా 'కల్కి'
  • దర్శకుడిగా ప్రశాంత్ వర్మ 
  • కథానాయికగా ఆదా శర్మ    

'గరుడవేగ' హిట్ తరువాత కొత్తగా అనిపించే కథ కోసం రాజశేఖర్ కొంతకాలం వెయిట్ చేశారు. ఆ తరువాత ఆయనకి ప్రశాంత్ వర్మ ఒక కథ వినిపించగా నచ్చేసిందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేసుకుని సెట్స్ పైకి వెళ్లారు. రాజశేఖర్ తనకి బాగా అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఆదా శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా టీజర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. దశావతారాల్లో 'కల్కి' అవతారం 10వ అవతారం కావడం వలన, ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్టు చెప్పడం విశేషం. ఈ సినిమాతో రాజశేఖర్ మరో హిట్ కొడతారేమో చూడాలి.

More Telugu News