vishal: 'అయోగ్య' కోసం ఎదురుచూస్తోన్న విశాల్

  • 'టెంపర్' రీమేక్ గా 'అయోగ్య'
  • వచ్చేనెల 10వ తేదీన విడుదల
  •  హిట్ పై నమ్మకం పెట్టుకున్న విశాల్

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన 'టెంపర్' సినిమా మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. 'టెంపర్' కథ నచ్చడంతో .. తనకి గల మాస్ ఇమేజ్ కి ఈ సినిమా చేస్తే బాగుంటుందని విశాల్ భావించాడు. ఫలితంగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో .. విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో నిర్మితమైంది.

ఈ సినిమాలో విశాల్ నాయికగా రాశి ఖన్నా నటించింది. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను, మే 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విడుదల తేదీ ఎప్పుడు వస్తుందా అని విశాల్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ పై విశాల్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అందువలన తాను కూడా ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News