south central railway: ఏపీ ఎన్నికలకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు.. నేడు, రేపు అందుబాటులో 48 ప్రత్యేక రైళ్లు

  • ఏపీ ఓటర్ల కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
  • వేసవి రద్దీ కోసం అదనంగా మరిన్ని రైళ్లు
  • సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం, తిరుపతి మార్గాల్లో రైళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ నుంచి నేడు, రేపు ఏకంగా 48 ప్రత్యేక రైళ్లను నడపనుంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణానికి 39, గుంతకల్‌, కర్నూలు‌, తిరుపతికి 9 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది.

ఇవి కాక, వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి రెండు నెలలపాటు సేవలు అందించనున్నాయి. సాధారణంగా ఏపీకి రోజుకు సగటున 40 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, భువనేశ్వర్, నర్సాపూర్, నాందేడ్ వంటి ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇక, వేసవి నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. 

More Telugu News