Andhra Pradesh: సాయంత్రం 6 గంటల తర్వాత మీడియాలో ప్రకటనలు బంద్ చేయాలి: ఏపీ ఎన్నికల అధికారి ఆదేశం

  • సాయంత్రం ఆరు తర్వాత సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో ప్రకటనలు తొలగించాల్సిందే
  • 10, 11 తేదీల్లో ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీకి దరాఖాస్తు చేసుకోవాలి
  • హోర్డింగులు కూడా తొలగించాలి

ఇన్ని రోజులపాటు వివిధ పార్టీల ప్రకటనలతో హోరెత్తించిన మీడియా నేటి సాయంత్రం నుంచి సైలెంట్ కానుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి మీడియాలో ఎటువంటి ప్రకటనలు జారీ చేయరాదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేదీ పేర్కొన్నారు. 10,11 తేదీల్లో ప్రకటనలు ఇవ్వాలనుకునే పార్టీలు, అభ్యర్థులు ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గతంలో ఎంసీఎంసీ ఇచ్చిన అనుమతి నేటితో ముగిసిపోతుందని పేర్కొన్నారు. పార్టీల అభ్యర్థులు తమ ప్రకటనల్లో ఈవీఎంలలో ఈసీ తమకు కేటాయించిన సంఖ్య, పార్టీ, గుర్తులతోనే ప్రకటన జారీ చేయాల్సి ఉంటుందని ద్వివేదీ స్పష్టం చేశారు. అయితే, వీటికి కూడీ ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే, నేటితో ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో ఇస్తున్న డిజిటల్ ప్రకటనలు, ఏర్పాటు చేసిన హోర్డింగులను కూడా ఆరు గంటల తర్వాత తొలగించాలని ఆదేశించారు. లేదంటే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News