ప్రజా సంక్షేమమే పరమావధిగా టీడీపీ మేనిఫెస్టో: డొక్కా మాణిక్య వరప్రసాద్

08-04-2019 Mon 17:29
  • టీడీపీది ప్రజా మేనిఫెస్టో 
  • మేనిఫెస్టో కమిటీలో నేనూ సభ్యుడినే
  • గతంలో హామీలన్నీ అమలు చేశాం

టీడీపీది ప్రజా మేనిఫెస్టో అని, తాను కూడా ఆ కమిటీలో సభ్యుడినేనని, ఇంతమంచి మేనిఫెస్టో ఏ ఎన్నికల్లోనూ లేదని ప్రత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే పరమావధిగా టీడీపీ మేనిఫెస్టోని తయారు చేసిందన్నారు.

ఆ మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలు వచ్చాయన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో లేని పసుపు-కుంకుమ, రూ.3వేల పెన్షన్ వంటి పథకాలు కూడా అమలు చేశామని డొక్కా పేర్కొన్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.