nani: నాని మల్టీ స్టారర్ కి అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు

  • ఇంద్రగంటి దర్శకత్వంలో నాని
  • ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా
  • త్వరలోనే సెట్స్ పైకి      

కథాకథనాల్లోను .. పాత్రలను మలిచే తీరులోనూ కొత్తదనం ఉంటేనే తప్ప నాని ఒప్పుకోడు. అలాంటి నాని .. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అష్టాచమ్మా' .. 'జెంటిల్ మేన్' భారీ విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ .. సుధీర్ బాబుకి కూడా 'సమ్మోహనం' వంటి హిట్ ఇచ్చాడు. నాని - సుధీర్ బాబు కాంబినేషన్లోని సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ప్రస్తుతం మిగతా నటీనటులను ఎంపిక చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి. 

More Telugu News