Pulwama attack: పుల్వామా దాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు.. ఎన్నికల్లో గెలుపు కోసం పట్టించుకోలేదు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

  • ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ పని చేయనిచ్చారు
  • లేదంటే ఉగ్రవాదులకు బాంబులు ఎక్కడి నుంచి వస్తాయి?
  • మోదీ గెలవాలి కాబట్టే ఇది జరిగింది

నరేంద్రమోదీ ప్రభుత్వంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసని, ఎన్నికల్లో గెలుపు కోసం దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది పూర్తిగా వారి (కేంద్రం) తప్పిదమేనని పేర్కొన్నారు. ‘‘పుల్వామాలో దాడి జరగబోతోందని కేంద్రానికి ముందే తెలుసు. లేదంటే బాంబులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఎన్నికల్లో మోదీ గెలవాలి కాబట్టే ఇది జరిగింది’’ అని అబ్దుల్లా పేర్కొన్నారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలోని సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికిపైగా భారత జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకుంది. ఆ సంస్థకు చెందిన అదిల్ రషీద్ ఆత్మాహుతి దాడికి పాల్పద్డాడు. కారులో పేలుడు పదార్థాలు నింపుకుని సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు.

More Telugu News