Bollywood: నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రామ్ గోపాల్ వర్మ.. సొంత సినిమా ద్వారా అరంగేట్రం!

  • సినిమాకు ‘కోబ్రా’గా టైటిల్ ఖరారు
  • గన్ షాట్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వం
  • సినిమా నటీనటులు, ఇతర వివరాలపై ఇంకా రాని క్లారిటీ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా నటుడిగా అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నారు. తానే దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో వర్మ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్ర పూర్తి నిడివితో ఉంటుందా? లేక గెస్ట్ రోల్ మాత్రమేనా? అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఈ సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

గన్ షాట్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు? ఏయే భాషల్లో నిర్మిస్తారు? అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News