Actor Shivaji: కళ్లముందే నిజం కనిపిస్తున్నా ఇదంతా గ్రాఫిక్స్ అంటూ అబద్ధాలు చెబుతారా?: శివాజీ

  • కళ్లముందు కనిపిస్తున్న నిజాన్ని చూడండి
  • గ్రాఫిక్స్ అంటూ కట్టు కథలు
  • 2021లో అద్భుతం ఆవిష్కారం

విలేకరుల సమావేశంలో నటుడు శివాజీ ప్రదర్శిస్తున్న పోలవరం వీడియోను విలేకరులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎర్త్‌ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఎఫ్) నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, మరో 20 శాతం పనులు పూర్తయితే పశ్చిమగోదావరి-తూర్పుగోదావరి కలుస్తాయని శివాజీ పేర్కొన్నారు. గలగలా పారుతున్న గోదావరి నీటిని చూపించిన శివాజీ ఈ నీటిని స్టోర్ చేసుకోగలిగితే రాష్ట్రం సుభిక్షం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు దీనిని గ్రాఫిక్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కళ్లముందు కనిపించే ఈ అద్భుతాన్ని చూడాలని ఆ వీడియోలో శివాజీ పేర్కొన్నారు.

2020 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని, అయితే, 2021 అక్టోబర్, నవంబరు నెలల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వేలాదిమంది రాత్రింబవళ్లు ఇక్కడ కష్టపడుతున్నారని, కళ్లముందే నిజం కనిపిస్తున్నా ఇదంతా గ్రాఫిక్స్ అంటూ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు. ఎవరి కుటుంబాన్ని బాగుచేయడం కోసం ఈ అబద్ధాలు చెబుతున్నారని ప్రశ్నించారు.

More Telugu News