choukidar: ‘చౌకీదార్‌’ ప్రచారంపై ఎన్నికల సంఘం సీరియస్‌... రైళ్లలో టీ కప్పుల నిషేధం

  • శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల్లో ఇలా ముద్రించిన కప్పుల్లో టీ సరఫరా
  • సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడడంతో ఈసీ సీరియస్‌
  • తక్షణం నిలిపి వేయాలని రైల్వేశాఖకు ఆదేశాలు

‘మే భీ చౌకీదార్‌’...భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ తనకు తాను తరచూ చెప్పుకునే పేరు ఇది. ఆయన ట్విట్టర్‌ అకౌంట్‌ పేరును కూడా ‘చౌకీదార్‌ నరేంద్రమోదీ’ అని మార్చుకున్నారు. ఆయన ప్రసంగాల్లో ఎక్కువసార్లు వినిపించే మాట ఇదే. అందుకే ‘ఆయన చౌకీదార్‌ కాదు, ఆర్థిక నేరస్థులకు కాపలాదార్‌’ అని విపక్షాలు విరుచుకుపడుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే ఈ ‘చౌకీదార్‌’ పేరుతో ముద్రించి ఉన్న టీ కప్పులను ఎన్నిక సంఘం నిషేధించింది.

వివరాల్లోకి వెళితే, ‘సంకల్ప్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ అడుగు ముందుకు వేసి, చౌకీదార్‌ అని ముద్రించి ఉన్న టీ కప్పుల్లో శతాబ్ది రైళ్లలో టీ సరఫరా చేస్తోంది. ఈ విషయాన్ని వీడియోతీసి ఎవరో సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్తా ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఈ కప్పుల వాడకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల అధికారులు రైల్వేశాఖకు ఆదేశాలు జారీచేశారు. ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంటూ వివరణ కూడా కోరింది.

More Telugu News