MIM: హిందూమతానికి కాదు... స్వార్థపరులైన హిందుత్వవాదులకు మేం వ్యతిరేకం: అసదుద్దీన్‌ ఒవైసీ

  • ఎన్నిక వేళ ఎంఐఎం అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు
  • టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నల్లగొండ సభలో ప్రసంగం
  • మైనార్టీలకు టీఆర్‌ఎస్‌ హయాంలోనే రక్షణ అని వ్యాఖ్య

ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వార్థపరులైన హిందుత్వవాదులకు తాము వ్యతిరేకమని, హిందూ మతానికి కాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చేవారితోనే తమ పోరాటమని స్పష్టం చేశారు. మిత్ర పక్షం టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నల్లగొండలో నిర్వహించిన మైనార్టీల సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిందుమతాన్ని ఎంతలా గౌరవిస్తారో, ఇతర మతాల వారిని అంతేలా గౌరవిస్తారని, అందుకే ఆయన పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

బడుగు, బహీనవర్గాలు, దళితులు, మైనార్టీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే పూర్తి రక్షణ ఉందని చెప్పారు. అందుకే ఆ పార్టీతో తాము బహిరంగంగానే చేతులు కలిపి పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీల్లా రహస్య ఒప్పందాలు, తెరవెనుక రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిపి మొత్తం 17 ఎంపీ స్థానాలను గెల్చుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

More Telugu News