బంతిని తీసుకొచ్చే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి మంటల్లో చిక్కుకున్న విద్యార్థి!

05-04-2019 Fri 18:08
  • బంతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన చిన్నారి 
  • 11 కేవీ వైర్‌ను గమనించకపోవడంతో ప్రమాదం
  • పరిస్థితి విషమించడంతో యశోదాలో చికిత్స
భవనంపై పడిన బంతిని తీసుకురావడానికి వెళ్లిన చిన్నారికి కరెంట్ షాక్ కొట్టడంతో పరిస్థితి విషమంగా మారిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 7వ తరగతి పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా క్రికెట్ ఆడుతున్నారు. బంతి ఓ భవనంపై పడటంతో దానిని తీసుకు వచ్చేందుకు అఫ్రిది అనే విద్యార్థి వెళ్లాడు.

బంతిని తీసుకుచ్చే హడావుడిలో అక్కడే ఉన్న 11 కేవీ వైర్‌ను గమనించలేదు. దీంతో ఆ వైర్‌ను తాకిన అఫ్రిది మంటల్లో చిక్కుకోగా వెంటనే తోటి విద్యార్థులు వచ్చి రక్షించారు. హుటాముటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.