sensex: దేశీయ మార్కెట్ల నష్టాలకు బ్రేక్

  • అంతర్జాతీయంగా సానుకూలతలు
  • 178 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 11,665 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

రెండు రోజుల పాటు నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ గాడిలో పడ్డాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో లాభాలను గడించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178 పాయింట్లు లాభపడి 38,862కు పెరిగింది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకుని 11,665 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.36%), వేదాంత (2.38%), బజాజ్ ఫైనాన్స్ (2.20%), టీసీఎస్ (1.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.68%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.46%),  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.36%), హీరో మోటో కార్ప్ (-0.78%), ఎన్టీపీసీ (-0.70%), సన్ ఫార్మా (-0.67%),  హిందుస్థాన్ యూనిలీవర్ (-0.50%).

More Telugu News