bellamkonda srinivas: ఆసక్తిని రేపుతోన్న 'రాక్షసుడు' ప్రీ లుక్ పోస్టర్

  • బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'రాక్షసుడు'
  • తమిళ 'రాచ్చసన్'కి రీమేక్ 
  • రేపు రానున్న ఫస్టులుక్

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'రాక్షసుడు' సినిమా రూపొందుతోంది. తమిళంలో కొంతకాలం క్రితం విజయాన్ని అందుకున్న 'రాచ్చసన్' కి ఇది రీమేక్. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

గోడల నిండా పాత పేపర్ కటింగ్స్ అతికించబడి ఉండగా .. ఆ గది పైభాగం నుంచి ఒక బొమ్మ తల వేళ్లాడుతోంది. ముఖమంతా గాయాలు చేయబడి ఆ బొమ్మ తల భయంకరంగా కనిపిస్తోంది. ఓ రాక్షసుడి మనస్తత్వానికి ఆ గది అద్దం పడుతోంది. ఇక 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి. 

More Telugu News