varma: కోతి బొమ్మల ద్వారా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పరిస్థితిని చెప్పిన వర్మ

  • ఆంధ్రలో విడుదల కాని 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
  • సుప్రీమ్ కోర్టులోను చుక్కెదురు
  •  అసంతృప్తికి లోనైన రామ్ గోపాల్ వర్మ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వైపుకు అందరి దృష్టి మళ్లించే విషయంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు. అయితే ఈ సినిమా తెలంగాణలో విడుదలైందిగానీ, ఆంధ్రాలో థియేటర్లలోకి వెళ్లలేకపోయింది. ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం ఉంటుందని కొంతమంది హై కోర్టును ఆశ్రయించడంతో .. న్యాయస్థానం స్టే విధించింది. సుప్రీమ్ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.దాంతో వర్మ పెయింటింగ్స్ రూపంలో తన ట్విట్టర్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేశారు. గొలుసులతో కట్టేయబడిన ఒక కోతిపిల్ల పెయింటింగును వర్మ షేర్ చేశారు. ఆ కోతిపిల్లను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాగా చెబుతూ, ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటం వలన తాను చాలా అలసిపోయాననేది దాని ఎక్స్ ప్రెషన్ గా పేర్కొన్నారు.

అలాగే తల్లికోతి .. పిల్లకోతిని ఓదార్చే మరో పెయింటింగును కూడా ఆయన షేర్ చేశారు. తాను తల్లికోతిగా .. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని పిల్లకోతిగా ప్రస్తావిస్తూ, ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పరిస్థితి ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి  సరైన సమయంలో ఈ సినిమాను విడుదల చేయలేకపోయాననే అసంతృప్తి వర్మలో కనిపిస్తోందనే చెప్పుకోవాలి.

More Telugu News