Chandrababu: 'పార్టీ మారడానికి సిగ్గులేదా?'... చంద్రబాబు ఆగ్రహం!

  • రావెల కిశోర్ బాబుకు రాజకీయ భవిష్యత్తు లేదు
  • ఆయన చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయం
  • కోటి మంది మహిళల భవిష్యత్తు తనదేనన్న చంద్రబాబు

ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు పార్టీ మారడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. నియోజకవర్గం పరిధిలోని పెదనందిపాడులో టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ గెలుపు కోరుతూ రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు, "సిగ్గు లేకుండా పార్టీ మారుతావా? నీ వంటి వాళ్లు చరిత్ర హీనులుగా మిగలడం ఖాయం. రాజకీయంగా నీకు భవిష్యత్తే లేదు. జీరో అవుతావు" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఆ విజయం పేదలందరిదని, పేదలకు కష్టం కలుగకుండా చూసుకుంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనకు కోటి మంది చెల్లెమ్మలు ఉన్నారని, వారందరి భవిష్యత్తు బాధ్యత తనదేనని అన్నారు. జగన్, నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒకటిగా నిలిచినా తనను ఏమీ చేయలేరని, తనపై పెత్తనం చేయడం ఎవరి తరమూ కాదని హెచ్చరించారు. తాను బిల్ క్లింటన్ ను మిస్టర్ అని సంబోధించానని, మోదీని మాత్రం సార్ సార్ అని వేడుకున్నానని, అయినా ఆయన మనకు ద్రోహం చేశారని విమర్శలు గుప్పించారు.

More Telugu News