vijay devarakonda: రష్మిక మందనకి బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' ఫస్టుసాంగు రిలీజ్ డేట్ ఫిక్స్

  • 'డియర్ కామ్రేడ్' గా విజయ్ దేవరకొండ
  •  ఈ నెల 8వ తేదీన ఫస్టు సాంగ్ రిలీజ్
  •   మే 31వ తేదీన సినిమా విడుదల   

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' నిర్మితమైంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా, మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజున (ఏప్రిల్ 5) రష్మిక మందన పుట్టినరోజు. ఈ సందర్భంగా రష్మికకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, 'డియర్ కామ్రేడ్'లో ఆమె లుక్ కి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.

ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును ఈ నెల 8వ తేదీ(సోమవారం) ఉదయం 11 గంటల 11 నిమిషాలకి తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్న విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గాను .. రష్మిక క్రికెటర్ గాను కనిపించనుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. 

More Telugu News