samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ సినిమాలో సమంత?
  • కల్యాణ్ రామ్ మరో సినిమా 
  • సీక్వెల్ చేస్తున్న శ్రీను వైట్ల    

 *  ప్రభాస్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్క్రిప్ట్ కూడా రెడీగా వుందట. ఇందులో ఓ ప్రత్యేక పాత్ర వుందని, దానికి సమంతను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.  
*  ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో 'తుగ్లక్' చిత్రాన్ని చేస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. ఇటీవల 'మజ్ను' చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దీనికి దర్శకత్వం వహిస్తాడు. మే నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.
*  దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు 'ఢీ' చిత్రాన్ని చేశాడు. అది హిట్టయినప్పటికీ మళ్లీ వీరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఇప్పుడు వీరిద్దరూ ఓ చిత్రం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది 'ఢీ' చిత్రానికి సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

More Telugu News