Afghanisthan: లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేసిన ఐఎస్‌ఐ: నిఘా వర్గాల వెల్లడి

  • అభ్యర్థులు, పోలింగ్ బూత్‌లు లక్ష్యంగా ప్రణాళిక
  • సరిహద్దు ద్వారా పంపేందుకు యత్నం
  • జమ్ముకశ్మీర్‌‌ను టార్గెట్ చేసినట్టు ప్రకటన

భారత్ లో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేయనుంది. ఈ విషయమై తాజాగా భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో కశ్మీర్ బృందాలకు శిక్షణ ఇచ్చేందుకుగాను ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులను సరిహద్దు ద్వారా పంపేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై ఐఎస్ఐ గురిపెట్టినట్టు తెలిపాయి. దీని కోసం కశ్మీర్ లోయలో జైషే మహ్మద్‌తో పాటు లష్కరే తోయిబా వంటి మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News