Jammu And Kashmir: కశ్మీర్లో సైనిక వాహనాల కోసం.. వారానికి రెండు రోజులు ట్రాఫిక్ బంద్

  • బారాముల్లా-ఉధంపూర్ జాతీయ రహదారిపై ఆంక్షలు 
  • సోమ, బుధవారాల్లో సామాన్య వాహనాల ప్రయాణంపై నిషేధం
  • మే 31 వరకు ఆంక్షలు

జమ్ముకశ్మీర్ లో అత్యంత కీలకమైన బారాముల్లా-ఉధంపూర్ జాతీయ రహదారికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్ ను నిషేధించింది. మే 31వ తేదీ వరకు ప్రతి సోమవారం, బుధవారం సివిలియన్ ట్రాఫిక్ ను నిషేధిస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

ఈ రోజుల్లో జాతీయ రహదారిపై కేవలం భద్రతాబలగాల వాహనాలు మాత్రమే ప్రయాణిస్తాయి. ఎన్నికల నేపథ్యంలో, భద్రతాదళాల వాహనాలపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉండటంతో... ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం, బుధవారాల్లో ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. బారాముల్లా, ఉధంపూర్ జాతీయ రహదారిపై శ్రీనగర్, క్వాజీగుండ్, జవహర్ టన్నెల్, బనిహాల్, రాంబన్ లు ఉన్నాయి.

More Telugu News