gopichand: గాయాల నుంచి కోలుకుని షూటింగుకి సిద్ధమవుతోన్న గోపీచంద్

  • అనిల్ సుంకర నిర్మాణంలో యాక్షన్ ఎంటర్టైనర్ 
  • తిరు దర్శకత్వంలో గోపీచంద్
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు   

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గోపీచంద్ సినిమాలంటే మాస్ ఆడియన్స్ కి కూడా పండుగే. అందువల్లనే తన సినిమాల్లో అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండేలా గోపీచంద్ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, కొంతకాలం వెయిట్ చేసి మరీ ఆయన దర్శకుడు 'తిరు'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అనిల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా గోపీచంద్ గాయపడ్డాడు. ఈ కారణంగా ఆ షెడ్యూల్ షూటింగును ఆపేశారు. ఆ గాయాలు నయమై గోపీచంద్ కోలుకున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా షూటింగులో తిరిగి పాల్గొనేందుకు గోపీచంద్ సిద్ధమవుతున్నాడట. డిఫరెంట్ లుక్ తో గోపీచంద్ కనిపించనున్న ఈ సినిమా, ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News