India: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం!

  • ద్వైపాక్షిక సంబంధాల కృషికి ప్రకటించిన యూఏఈ 
  • ఇరుదేశాల సంబంధాల పటిష్టత కోసం చేసిన కృషికి గుర్తింపు
  • గతంలో ఇదే అవార్డును అందుకున్న పుతిన్, సర్కోజీ, మెర్కల్

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘జయాద్ మెడల్’ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రకటించింది. భారత్-యూఏఈల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు.

ఈ అత్యున్నత పురస్కారాన్ని గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ తదితరులు మాత్రమే అందుకున్నారు. తాజాగా వీరి సరసన ప్రధాని మోదీ చేరారు.

More Telugu News