China: 'ఆవు' కథ చెప్పిన చింతమనేని ప్రభాకర్

  • తనదైన శైలిలో ప్రచారం చేస్తున్న చింతమనేని
  • ప్రభుత్వ పథకాలను అనుభవిస్తూ.. పక్క పార్టీకి ఓటు వేస్తామంటే ఎలా అంటూ ప్రశ్న
  • ఉదాహరణగా ఆవు కథను చెప్పి ఆకట్టుకున్న వైనం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మరోసారి గెలుపును దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆవు కథ చెప్పారు.

'నా ఇంటిలో నేను ఒక ఆవును మేపుతున్నా. ప్రతిరోజు దానికి పశువుల దాణా, గుగ్గిళ్లు, తెలగపిండి, పచ్చగడ్డి పెడుతున్నా. ఆవు పొదుగు పాలతో నిండుగా కనిపిస్తోంది. పాలు పితికేందుకు వెళ్తే నన్ను పడేలున తంతోంది. పక్కనోడికి మాత్రం చక్కగా పాలిస్తోంది. మీకంతా విచిత్రంగా అనిపిస్తున్నా... ఇది నిజం.

ఎలాంగంటే... తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోంది. కొంతమంది వీటిని ఆనందంగా అనుభవిస్తూనే పక్క పార్టీకి ఓటు వేస్తామని చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం? పక్క పార్టీ మీద అభిమానం ఉంటే... మీ పథకాలు మాకొద్దని చెప్పాలి. అన్నీ అనుభవిస్తూనే పక్క పార్టీకి ఓటు వేస్తామంటే ఎలా? నా మేత తిని పక్కోడికి పాలివ్వడమంటే ఇదే' అంటూ చింతమనేని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. 

More Telugu News