chinranjeevi: జనసేన ప్రచారానికి అన్నయ్య రారు: పవన్ కల్యాణ్

  • రాజకీయాలకు సంబంధించి అన్నయ్య తుది నిర్ణయం తీసేసుకున్నారు
  • రాజకీయాలను తామిద్దరం వేర్వేరుగా చూస్తాం
  • అన్నయ్య కళాకారుడు.. నేను కళాకారుడు కాదు

జనసేన ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి వస్తే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, అన్నయ్య చిరంజీవి జనసేన ప్రచారానికి రారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధించి అన్నయ్య ఒక తుది నిర్ణయానికి వచ్చేశారని చెప్పారు. రాజకీయాలను ఆయన చూసే విధానం... తాను చూసే విధానం వేరువేరని తెలిపారు. ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య పూర్తి స్పష్టం ఉందని చెప్పారు. అన్నయ్య చిరంజీవి కళాకారుడని... తాను కళాకారుడిని కాదని తెలిపారు.

More Telugu News