Elections: అత్యధికం తమిళనాడు, ఏపీలోనే... ఇప్పటివరకూ రూ. 377 కోట్లు స్వాధీనం: ఈసీ

  • రూ. 157 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
  • రూ. 312 కోట్ల విలువైన బంగారం కూడా
  • రూ. 50 వేల నగదు మించే పత్రాలు తప్పనిసరి

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ, ఇప్పటివరకూ రూ. 377.51 కోట్ల డబ్బును అధికారులు సీజ్ చేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పాటు రూ. 157 కోట్ల విలువైన మద్యం, రూ. 705 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ. 312 కోట్ల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సీజ్ చేసినదే అత్యధికమని అన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలను నిర్వహిస్తున్నారని, ఎవరైనా రూ. 50 వేలకు మించి నగదు తీసుకు వెళుతుంటే, ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను తమతో పాటు తీసుకువెళుతుండాలని, లేకుంటే, ఆ డబ్బును ఐటీ శాఖకు అప్పగించక తప్పదని ఈసీ హెచ్చరించింది. ఆభరణాలు తీసుకెళుతున్నా, వాటికి సంబంధించిన రసీదులు తప్పనిసరని పేర్కొంది.

More Telugu News