charan: జిమ్ లో చరణ్ కసరత్తులు .. స్వల్ప గాయం!

  • గుజరాత్ లో జరుగుతోన్న షూటింగు
  • పూణే షెడ్యూల్ షూటింగు వాయిదా
  •  చరణ్ జోడీగా అలియా భట్  

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ ఇద్దరూ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు గుజరాత్ లో జరుగుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పాత్ర పరంగా ఈ సినిమాలో చరణ్ మరింత ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది.

అందువలన ఆయన రెగ్యులర్ గా జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. నిన్న ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా చీలమండకు చిన్న గాయమైందనే సమాచారాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ గాయం కారణంగా .. పూణేలో జరపవలసిన తదుపరి షెడ్యూల్ షూటింగును వాయిదా వేశారు. చరణ్ కు నొప్పి తగ్గిన తరువాత .. అంటే 3 వారాల తరువాత షూటింగులో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News