ram: 'దిమాక్ ఖరాబ్ .. ' అంటూ సాంగ్ అందుకున్న రామ్

  • షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • మే నెలలో విడుదల      

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. రామ్ సరసన నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. 'దిమాక్ ఖరాబ్ ..' అంటూ సాగే పాటను రామ్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా .. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిఫరెంట్ లుక్స్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమా, ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనేది అభిమానుల మాట. 

More Telugu News