Tollywood: మోహన్ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!

  • ఇటీవలే వైసీపీలో చేరిన సినీనటుడు మోహన్ బాబు 
  • గత నెల 26న బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఫిర్యాదు
  • విదేశాల నుంచి ఈ కాల్స్ వచ్చినట్టు సమాచారం

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే, వైసీపీలో తాను చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి మోహన్ బాబుకు వచ్చినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.

More Telugu News