sensex: బుల్ జోరుకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 180 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 39వేల మార్కును అధిగమించిన మరుసటి రోజే మార్కెట్లు నష్టపోయాయి. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందంటూ 'స్కైమెట్' సంస్థ చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీనికి తోడు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో... చివరి రెండు గంటల్లో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 38,877కు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 11,643 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకీ (2.78%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.48%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (1.02%), టాటా స్టీల్ (0.81%), హీరో మోటో కార్ప్ (0.50%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.40%), యస్ బ్యాంక్ (-2.37%), భారతి ఎయిర్ టెల్ (-2.11%), ఎల్ అండ్ టీ (-2.11%), సన్ ఫార్మా (-1.48%).

More Telugu News