prabhas: ప్రభాస్ తో కాలు కదపనున్న హాలీవుడ్ భామ

  • 'సాహో' సినిమాలో స్పెషల్ సాంగ్
  • ప్రభాస్ తో కాలు కదపనున్న కైలీ మినోగ్
  • ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కైలీ

ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఇప్పటికే భారత్ లో తెరకెక్కిన భారీ చిత్రాల సరసన చేరింది. ఈ చిత్రం కోసం ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వెలుగుచూసింది. ఓ స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ సుందరి కైలీ మినోగ్ ను తీసుకొస్తున్నారని సమాచారం.

బ్రిటీష్ భామ అయిన కైలీ మినోగ్ కు పాప్ గాయనిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. 'సాహో'లో ప్రభాస్ సరసన స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆమె అంగీకరించినట్టు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా 2009లో తెరకెక్కిన 'బ్లూ' చిత్రంలో కైలీ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత మరో ఇండియన్ మూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదే ప్రథమం.

More Telugu News