prabhas: రజనీతో పోటీపడనున్న ప్రభాస్

  • ఆగస్టు 15వ తేదీన 'సాహో' రిలీజ్ 
  • సంక్రాంతికి తదుపరి సినిమా విడుదల 
  • అదే సమయంలో రానున్న రజనీ మూవీ  

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' అనే సినిమా చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి గోపీకృష్ణ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే తమిళంలో సంక్రాంతికి రజనీకాంత్ మూవీ విడుదల కానుంది. రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు మురుగదాస్ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకులకి అందించాలనే నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నారు. అందువలన ఈ రెండు సినిమాల మధ్య అక్కడ పోటీ తప్పదని అంటున్నారు. రజనీతో పోటీ అంటే అంత ఆషామాషీ విషయమేం కాదు .. ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి మరి. 

More Telugu News