kajal: యాక్షన్ హీరోతో చేయడానికి ఓకే చెప్పేసిన కాజల్!

  • బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్
  •  దర్శకుడిగా బినూ సుబ్రహ్మణ్యం 
  •  జూన్ నుంచి సెట్స్  పైకి    

కాజల్ తాజా చిత్రంగా 'సీత' నిర్మితమైంది. కాజల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, వచ్చేనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, తనకి మరింత మంచి గుర్తింపు తెస్తుందని ఆమె భావిస్తోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది తాజా సమాచారం.

గోపీచంద్ కథానాయకుడిగా నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన కాజల్ ను ఎంపిక చేసుకున్నాడు. గోపీచంద్ తో కాజల్ చేస్తున్న తొలి సినిమా ఇదే. అందువలన ఈ కాంబినేషన్ పట్ల అందరిలోను ఆసక్తి పెరుగుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కొంతకాలంగా పరాజయాలతో కెరియర్ ను నెట్టుకొస్తోన్న గోపీచంద్ కి ఈ సినిమా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి

More Telugu News