varma: పక్కనే వుండి నమ్మిస్తూ చేసే మోసాన్నే వెన్నుపోటు అంటారు: వర్మ

  • ఎన్టీఆర్ పద్ధతి నచ్చకపోతే నేరుగా చెప్పేయాలి 
  • నమ్మించి గద్దె దింపడం వెన్నుపోటే 
  • 'ఊర్మిళాస్ ఆర్జీవీ' పేరుతో సినిమా తీస్తే అభ్యంతరం లేదు  

తాజాగా 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి సంబంధించి అడిగిన ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. "రెండో పెళ్లి చేసుకున్న వారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు కనిపిస్తారు. అలాగే ఎన్టీ రామారావుగారు .. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ గారు అలా చేయడం కరెక్టా కాదా అని చెప్పడానికి నేను జడ్జిని కాదు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు .. అదే నేను చూపించాను.

ఎన్టీఆర్ మూలంగానే ఫ్యామిలీ వుంది .. పార్టీ వుంది. ఎన్టీఆర్ పద్ధతి నచ్చకపోతే .. ఆ విషయం ఆయన ముందే చెప్పేసి .. పార్టీలో నుంచి వెళ్లిపోతామని బెదిరించవచ్చు .. వేరే పార్టీ పెట్టుకుంటామని చెప్పొచ్చు. అలా ఆయనకి నేరుగా చెప్పకుండా పక్కనే వుండి నమ్మించి గద్దె దింపడమనేది 'వెన్నుపోటు'కాక మరేమవుతుంది? పక్కనే వుంటూ నమ్మిస్తూ మోసం చేయడాన్నే వెన్నుపోటు అంటారనే విషయం మనకి డిక్షనరీ చెబుతోంది" అన్నారు. "మరి రేపొద్దున ఎవరైనా 'ఊర్మిళాస్ ఆర్జీవీ' అని సినిమా తీస్తే మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారా?" అనే ప్రశ్నకి సమాధానంగా, 'ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయను' అని వర్మ చెప్పారు. 

More Telugu News